బొద్దుగా వుండే అంజలి స్లిమ్ గా మారిపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బొద్దుగా వుండే అంజలి స్లిమ్ గా మారిపోయింది!

  • బొద్దుగానే ఉంటూ అలరించిన అంజలి 
  • నాజూకుదనంపై దృష్టి 
  • మలయాళంలో బిజీ 
  • తాజా చిత్రంగా 'బెలూన్'  
తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ వుంది. ఆ మధ్య తెలుగులో అవకాశాలను బాగానే సంపాదించుకున్న అంజలి, ఆ తరువాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఈ మధ్య కాలంలో అవకాశాలు మరింత తగ్గుతూ వచ్చాయి. దాంతో అంజలి తమిళంతో పాటు మలయాళ సినిమాలపై దృష్టి పెట్టింది.

అంతే కాకుండా తన కెరియర్ ను దృష్టిలో పెట్టుకుని .. బరువు తగ్గడంపై శ్రద్ధ పెట్టింది. నాజూకుగా కనిపించడం కోసం జిమ్ లో బాగానే వర్కౌట్స్ చేసిందట. ఇప్పుడు అంజలిని చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు .. అంతగా ఆమె సన్నబడింది. తెరపై కొత్తగా కనిపించడం వలన తనకి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె భావిస్తోంది. ఆమె ఆశలు నిజమవుతాయేమో చూడాలి. ఆమె తాజా చిత్రంగా తమిళంలో  రూపొందుతోన్న 'బెలూన్' .. త్వరలో తెలుగులోనూ విడుదల కానుంది.             
anjali

More Telugu News