ఎక్కడా తగ్గేది లేదంటున్న బాలకృష్ణ!
Add ap7am to your home Screen

ఎక్కడా తగ్గేది లేదంటున్న బాలకృష్ణ!

  • ఓ వైపు ప్రజాసేవ, మరో వైపు సినిమాలు
  • సంక్రాంతికి 'జై సింహా'తో రెడీ
  • వెంటనే ఎస్వీ కృష్ణారెడ్డితో చిత్రం
  • కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు
ఓ వైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూనే, మరోవైపు ఏ కుర్ర హీరోకూ తగ్గకుండా సినిమాలు చేయడంలో తాను ముందుంటానని చెబుతున్నారు బాలకృష్ణ. ఎక్కడా తగ్గేది లేదని, వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతానని చెప్పిన ఆయన, ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అభిమానులను అలరిస్తానని గతంలో చెప్పిన ఆయన, చెప్పినట్టే చేస్తున్నారు.

తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' తరువాత వెంటనే 'పైసా వసూల్' చేసిన బాలకృష్ణ, మరో క్షణం ఆగకుండా 'జై సింహా'నూ పూర్తి చేశారు. ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో మరో చిత్రాన్ని ఒప్పుకున్నారు కూడా. రెండు దశాబ్దాల క్రితం ఎస్వీతో కలిసి 'టాప్ హీరో' చేసిన బాలయ్య, ఇంతకాలానికి ఆయనతో మరో చిత్రం ఒప్పుకున్నారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ఎలానూ ఉంది. దానిలోనూ బాలయ్యే హీరో. మొత్తం మీద వయసు పెరుగుతున్నా, అందుకు తగ్గట్టే స్పీడ్ ను కూడా పెంచుకుంటూ దూకుతున్నారు బాలయ్య.
Balakrishna
SV Krishna Reddy
Top Hero
New Movies

More Telugu News