సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నేచురల్ గానే వుండాలంటున్న ముద్దుగుమ్మ 
  • ఎన్టీఆర్-చరణ్ సినిమా అప్ డేట్స్  
  • విజయ్ దేవరకొండ 'గీత గోవిందం'
  • 'జైసింహా'లో బ్రహ్మానందం కామెడీ  
*  సైజ్ జీరో బాడీ తెచ్చుకోవాలన్న కోరిక తనకేమీ లేదని అంటోంది బబ్లీ హీరోయిన్ రాశిఖన్నా. "ఇటీవల కొన్ని పాత్రల కోసం కాస్త బరువు తగ్గవలసి వచ్చింది. అంతేతప్ప, సైజ్ జీరో కోసం మాత్రం కాదు. అదీగాక సహజమైన అందాన్ని పాడుచేసుకుని, ఇలా సైజ్ జీరో బాడీ తెచ్చుకోవడం అంటే నాకు ఇష్టం వుండదు. సహజంగా వచ్చింది సహజంగానే వుండాలి" అని చెప్పింది.
*  ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్లో రాజమౌళి రూపొందించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ చేస్తారని, ఆ తరవాత చరణ్ షూటింగులో జాయిన్ అవుతాడని అంటున్నారు.
*  'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి 'గీత గోవిందం' అనే టైటిల్ నిర్ణయిస్తున్నట్టు సమాచారం. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.
*  ఇటీవలి కాలంలో కాస్త జోరు తగ్గించిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇప్పుడు బాలకృష్ణ చిత్రం 'జైసింహా'లో కీలక పాత్రను పోషిస్తున్నాడట. ఆయన పాత్ర నిడివి చాలా పెద్దగా ఉంటుందని, కడుపుబ్బా నవ్విస్తాడని తెలుస్తోంది.  
Rashikhanna
NTR
Charan
vijay
balakrishna

More Telugu News