rana: నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతోన్న కృష్ణవంశీ .. హీరోగా రానా?

షార్ట్స్‌లో చూడండి
క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు. 'నిన్నే పెళ్లాడుతా' .. 'ఖడ్గం' .. 'సిందూరం' .. 'మహాత్మ' వంటి సినిమాలు ఆయన ప్రతిభకు కొలమానంగా నిలుస్తాయి. అలాంటి కృష్ణవంశీకి కొంతకాలంగా సరైన హిట్ లేదు. రీసెంట్ గా వచ్చిన 'నక్షత్రం' కూడా పరాజయం పాలైంది. ఇక ఆయన నుంచి మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టొచ్చని అనుకున్నారు.

కానీ ఆయన ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఆయన, ఒక హీరోగా మాధవన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. మరో హీరోగా రానా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడు. మాధవన్ .. రానా పాత్రలు నువ్వా .. నేనా? అన్నట్టుగా ఉంటాయట. తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.          
Go Back to Shorts
rana
madhavan

More Telugu News