Call Girl: మాజీ ప్రేయసిని కాల్ గర్ల్ గా పరిచయం చేసిన ప్రబుద్ధుడు... కటకటాల వెనక్కి!

షార్ట్స్‌లో చూడండి
గతంలో తనను ప్రేమించి, ఆపై మరో యువకుడిని వివాహం చేసుకుందన్న కక్షతో, ఆమె పరువు తీయాలని భావించి పాడు పనులు చేసి కటకటాల వెనక్కి వెళ్లాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లాకు చెందిన సందీప్‌ కుమార్‌ గుప్తా, ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ప్రేమించాడు. ఆమె అతన్ని కాదని మరో పెళ్లి చేసుకుంది.

దీంతో ఆగ్రహంతో ఆ యువతి పేరిట ఫేక్ అకౌంట్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లో తెరచిన సందీప్, ఆమెను కాల్ గర్ల్ అని చెబుతూ ఆమె ఫోన్ నంబర్ పెట్టాడు. ఆపై లొకాంటో, బ్లాగ్ స్పాట్ తదితర వెబ్ సైట్లలో ఆమెను వేశ్యగా పరిచయం చేయడంతో పాటు ఆమె కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నంబర్లనూ ఉంచాడు. దీంతో ఆమెకు నిరంతరాయంగా అసభ్య కాల్స్ వెళ్లడం మొదలైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీ, కాల్ డేటా వివరాల సాయంతో సందీప్ ను అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.
Go Back to Shorts
Call Girl
Social Media
Kurnool
Locanto

More Telugu News