జిమ్మిక్కీ కమ్మాల్ పాటకి కొత్త అభిమాని... పాటను ప్రశంసిస్తూ జూనియర్ బచ్చన్ ట్వీట్
- లేచి డ్యాన్స్ చేయాలనిపించేలా ఉందన్న అభిషేక్
- ఆనందం వ్యక్తం చేసిన సంగీత దర్శకుడు షాన్ రెహమాన్
- విడుదలై నాలుగు నెలలైనా పాటకు తగ్గని క్రేజ్
అమెరికన్ యాంకర్ జిమ్మీ కెమ్మల్ కూడా ఈ పాటను రీట్వీట్ చేశారు. యూట్యూబ్‌లో ఈ పాటకు డ్యాన్సులు చేస్తూ వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు వీడియోలు పెట్టారు. నటుడు మోహన్‌లాల్ కూడా ఈ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు అభిషేక్ ట్వీట్ చేయడంతో ఈ పాట మరోసారి వైరల్ అవుతోంది. ట్వీట్‌కి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ పాట కంపోజర్ షాన్ రెహమాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. అందులో అభిషేక్‌కి ధన్యవాదాలు తెలియజేశాడు.