balakrishna: బాలకృష్ణ సరసన నటించడం నా అదృష్టం: హరిప్రియ

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ 102వ సినిమాగా 'జై సింహా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన సరసన నయనతార .. నటాషా దోషితో పాటుగా హరిప్రియ కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. తాజా ఇంటర్వ్యూలో  ఈ సినిమాను గురించి హరిప్రియ మాట్లాడుతూ "ఈ సినిమాలో నేను అల్లరిపిల్లగా కనిపిస్తాను .. ఈ పాత్రను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను" అంది.

 "దర్శకులు కె.ఎస్.రవికుమార్ నా పాత్రను మలిచిన తీరు నాకెంతగానో నచ్చింది. ఆయన ప్రతి సీన్ ను నటించి చూపించడం వలన, నా పని తేలిక అయింది. ఇక బాలకృష్ణ గారు సీనియర్ హీరో అయినప్పటికీ రిహార్సల్స్ చేయడానికి ఎంత మాత్రం అభ్యంతరం చెప్పరు. తెలుగు సాహిత్యం పైనా .. ఆధ్యాత్మికత పైన ఆయనకి ఎంతో అవగాహన వుంది. ఆయనతో మాట్లాడితే ఎంతో నాలెడ్జ్ పెరుగుతుంది. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ సినిమా, తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.      
Go Back to Shorts
balakrishna
nayanatara

More Telugu News