జైలు నుంచి విడుదలయ్యేందుకు రూ.6500 కోట్లు చెల్లించిన సౌదీ యువరాజు
Add ap7am to your home Screen

జైలు నుంచి విడుదలయ్యేందుకు రూ.6500 కోట్లు చెల్లించిన సౌదీ యువరాజు

  • అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష ఎదుర్కున్న‌ సౌదీ అరేబియా యువరాజు
  • 20 రోజుల క్రితం అరెస్టు
  • అక్ర‌మాస్తుల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డంతో విడుద‌ల  
అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష ఎదుర్కుంటోన్న సౌదీ అరేబియా యువరాజు మితెబ్‌ బిన్‌ అబ్దుల్లా ప్ర‌భుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నారు. దీని ప్ర‌కారం జైలు నుంచి విడుద‌ల కావ‌డానికి రూ.6500 కోట్లకు పైగా స‌ర్కారుకు చెల్లించేందుకు మితెన్ బిన్ అబ్దుల్లా ఒప్పుకున్నారు. అవినీతికి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో 20 రోజుల క్రితం ఆయ‌న‌ను అరెస్టు చేశారు. తాను సంపాదించిన‌ అక్రమాస్తుల‌ను ఆయ‌న స‌ర్కారుకి అప్పగించేందుకు ఒప్పుకోవ‌డంతో యువ‌రాజును జైలు నుంచి విడుద‌ల చేశారు.      
southi prince
jail
released

More Telugu News