'నేటి క్షిపణి ప్రయోగంతో నా లక్ష్యం నెరవేరింద'న్న కిమ్ జాంగ్ ఉన్
- రాకెట్ శక్తిని సాధించాలన్న లక్ష్యం నెరవేరింది
- 4,475 కిలోమీటర్లు ప్రయాణించిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే పదిరెట్లు ఎక్కువ ఎత్తు
ఈ ప్రయోగంతో తిరుగులేని అణ్వాయుధ శక్తిగల దేశంగా ఎదగాలన్న తమ చిరకాల వాంఛ నెరవేరిందని స్పష్టం చేసింది. తమ దేశం అణ్వాయుధ సామర్థ్యం గల బాధ్యతాయుతమైన దేశమని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదుల అణ్వాయుధ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ నుంచి కాపాడుకోవడానికే వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేశామని ఆయన స్పష్టం చేశారు.