నటనకే ప్రాధాన్యత .. దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు: విజయ్ ఆంటోని

  • విజయ్ ఆంటోని హీరోగా 'ఇంద్రసేన'
  • అన్నదమ్ముల కథే నేపథ్యం 
  • మొదటిసారిగా ద్విపాత్రాభినయం 
  • ఈ నెల 30వ తేదీన విడుదల    
తమిళ హీరోలు విక్రమ్ .. సూర్య .. కార్తీ .. విశాల్ .. అజిత్ .. తెలుగులోను తమ సినిమాలను విడుదలయ్యేలా చూసుకుంటూ వుంటారు. అందువలన వాళ్లకి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వుంది. ఆ జాబితాలో చేరిన మరో హీరోగా విజయ్ ఆంటోనిని చెప్పుకోవాలి. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో .. తన తదుపరి చిత్రం 'ఇంద్రసేన'తో ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఇద్దరు అన్నదమ్ముల మధ్య బలమైన ఎమోషన్స్ తో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పాడు. మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం ఒక మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. 'నేరుగా తెలుగు సినిమా చేయాలనే ఆలోచనతో వున్నాను .. తెలుగు కథలు వింటున్నాను. అంతా దర్శకత్వం కూడా చేయమని అడుగుతున్నారు .. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. నటనపైనే పూర్తి దృష్టి పెట్టాను" అంటూ చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
vijay antony

More Telugu News