pm: హైదరాబాద్ చేరుకున్న ప్ర‌ధాని మోదీ.. స్వాగతం పలికిన నరసింహన్, కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
ప్రతిష్ఠాత్మక మెట్రో రైలు ఆవిష్క‌ర‌ణ కోసం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హైద‌రాబాద్ విచ్చేశారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.  షెడ్యూలు ప్ర‌కారం బేగంపేట‌లో విమానాశ్రయంలోనే కాసేపు బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం వాయుసేన‌కి చెందిన చాప‌ర్ల‌ో మియాపూర్ చేరుకోనున్నారు.

మియాపూర్ లో ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్‌ను ఆవిష్క‌రించి, మెట్రో రైలును జాతికి అంకితం చేయ‌నున్నారు. అదే మెట్రో ట్రైన్‌లో ఆయ‌న మియాపూర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లికి ప్ర‌యాణిస్తారు. ఈ ప్రయాణాన్ని చారిత్రాత్మకం చేసే క్రమంలో... మెట్రో ట్రైన్ న‌డపడానికి ఓ మ‌హిళా డ్రైవ‌ర్‌ను నియ‌మించారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య‌, అనుకున్న స‌మ‌యానికి కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.
Go Back to Shorts
pm
modi
Narendra Modi
KCR
metro

More Telugu News