sai dharam tej: 'అర్జున్ రెడ్డి' ముందుగా నా దగ్గరికి వస్తే చేసేవాడినే!: సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
"రీసెంట్ గా మీరు చూసిన సినిమాల్లో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన పాత్ర ఏదైనా ఉందా? ఇలాంటి పాత్రను ఎప్పటికైనా చేయాలనిపించిందా?" అనే ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " అలా అని నాకెప్పుడూ అనిపించలేదు' ఉదాహరణకి 'అర్జున్ రెడ్డి' వుంది .. అది విజయ్ దేవరకొండ చేశాడు గనుక అలా వుంది .. అది నేను చేయడం కరెక్టుగా ఉండదు" అన్నాడు.

"ఒకవేళ విజయ్ దేవరకొండకి వెళ్లకుండగా ముందుగా ఆ కథ మీ దగ్గరికి వస్తే మీరు ఓకే అనేవారా .. కాదా?" అనే ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. " చేసేవాడినే .. తప్పకుండా చేసేవాడినే .. " అని అన్నాడు. ఇక మరో ప్రశ్నకి సమాధానంగా ... "ఫలానా జోనర్ లో చేయాలని నేను అనుకోను. నన్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారనేది దర్శకులకు తెలుసు. అలాంటి కథలతోనే వాళ్లు వస్తుంటారు గనుక .. ప్రేక్షకులను మెప్పించడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తుంటాను" అని చెప్పాడు.         
Go Back to Shorts
sai dharam tej

More Telugu News