వేలానికి సిద్ధంగా ప్రిన్సెస్ డయానా 'వెడ్డింగ్ కేకు' ముక్క!
- అది 36 ఏళ్ల కిందటి కేకు
- 800 డాలర్లకు అమ్ముడవుతుందని అంచనా
- వేలంలో ఉంచిన ఆర్ఆర్ ఆక్షన్స్
అయితే వారి వెడ్డింగ్ కేకులో ఒక చిన్న భాగమైన ఈ కేకు ముక్క దాదాపు 800 డాలర్ల వరకు అమ్ముడవుతుందని ఆర్ఆర్ ఆక్షన్స్ వారు అంచనా వేస్తున్నారు. ఈ కేకును రాయల్ నావల్ కుకింగ్ స్కూల్‌కి చెందిన డేవిడ్ ఏవరీ తయారుచేశారు. దీంతో పాటు వారి పెళ్లి వేడుకలో ఉపయోగించిన చాలా వస్తువులు, లేఖలు, ఫొటోలను కూడా ఈ వేలంలో ఉంచారు. వీటిలో ప్రిన్సెస్ డయానా ఉపయోగించిన రత్నాలు పొదిగిన బ్యాగు ఎక్కువ ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.