స్టాలిన్ కు ఫోన్ చేసి, థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్!
- కేసీఆర్ ధర్నాకు స్టాలిన్ మద్దతు
- ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్
- కలసికట్టుగా ముందుకు సాగాలని నేతల నిర్ణయం
ఈ నేపథ్యంలో, స్టాలిన్ కు ఈరోజు కేసీఆర్ ఫోన్ చేశారు. రాష్ట్ర హక్కులను సాధించుకునే క్రమంలో తాను చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ల సాధనలో కలసికట్టుగా ముందుకు సాగాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రాల అధికారాల కోసం తాము చేస్తున్న కృషికి స్టాలిన్ మద్దతు పలికారని చెప్పారు.