sai dharam tej: అందరిలానే నేనూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను: సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' చిత్రం రూపొందింది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఐ డ్రీమ్స్ తో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారనీ .. లేదంటే టాటా చెప్పేస్తారని ఒక ప్రశ్నకి సమాధానంగా ఆయన చెప్పాడు. ఇక తాను హీరో కావడానికి ముందు పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించాడు.

"మొదట్లో .. ఓ కొత్త వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తగా ఎలా వస్తాడో నేను అలాగే వచ్చాను. ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రయత్నాలు చేశాను. చాలా ఆడిషన్స్ కి నేను వెళ్లేవాడిని .. అదే విధంగా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. అక్కడ నా ఫోటోలు  ఇచ్చి .. మేనేజర్స్ కి నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. మా మావయ్యలకున్న పేరును ఉపయోగించేవాడిని కాదు. 'కేరింత' సినిమా ఆడిషన్ కి కూడా వెళ్లాను .. అక్కడ నన్ను చూసిన దిల్ రాజు గారు, నీకు ఈ సినిమా కరెక్ట్ కాదు అని చెప్పేసి, 'పిల్లా నువ్ లేని జీవితం' నాకు వచ్చేలా చేశారు" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
sai dharam tej

More Telugu News