thotapalli madhu: 'నా ఎమోషన్స్ కి నేనే రియాక్టవుతా, వేరే వాళ్లెందుకు అవ్వాలి?' అంటారు బాలకృష్ణ: రచయిత తోటపల్లి మధు

షార్ట్స్‌లో చూడండి
'నా ఎమోషన్స్ కి నేనే రియాక్టవుతా, వేరే వాళ్లెందుకు అవ్వాలి?' అని బాలకృష్ణ అంటారని ప్రముఖ రచయిత తోటపల్లి మధు చెప్పారు. బాలకృష్ణ సినిమాలకు రచయితగా ఈయన పనిచేయడమే కాకుండా, ఆయనతో కలసి నటించారు కూడా. ఈ సందర్భంగా బాలయ్యతో తనకి వున్న అనుబంధం గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

మేకప్ లో బాలయ్య ఎంత దూకుడుగా ఉంటారో... మేకప్ తీసేసినప్పుడు ఆయన అంతకంటే ఎక్కువ సౌమ్యుడిగా మారిపోతారని మధు చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే, చిన్న పిల్లవాడైపోతారని అన్నారు. కింద కూర్చోవడానికి కూడా ఆయన సంశయించరని తెలిపారు. "ఓ సందర్భంలో బాలయ్య ఒకరిపై సీరియస్ అయ్యారు. ఆ సందర్భంలో నేను 'సార్, మీరెందుకు అలా అన్నారు. మీ అసిస్టెంటుకు చెబితే వాళ్లు చూసుకుంటారుగా' అన్నాను.

దీనికి సమాధానంగా, 'నా ఎమోషన్స్ కి నేనే రియాక్ట్ అవుతాను. వేరే వాళ్లెందుకు అవ్వాలి?' అని బాలయ్య అన్నారు. వాస్తవానికి ఆయన ఓ నలుగురు బౌన్సర్లను పెట్టుకుంటే, ఎవరూ దగ్గరకు కూడా రారు. కానీ, ఆయన అలా చేయరు. అలాంటివి ఆయనకు ఇష్టం ఉండదు. ఆయనకు నచ్చని విషయాల పట్ల కూడా ఆయనే రియాక్ట్ కావాలని కోరుకుంటారు" అని చెప్పారు.

బాలయ్య వ్యక్తిత్వం గురించి చెబుతూ, ఆయన చాలా సింపుల్ గా వుండే వ్యక్తి అని, డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కొనియాడారు. ఆయనతో తాను ఆర్టిస్ట్ గానూ, రైటర్ గానూ పని చేశానని చెప్పారు. పి.వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మహారథి' సినిమా కోసం బాలయ్య, తాను నైనిటాల్ లో 30 రోజులు  ఉన్నామని... అక్కడ నుంచి తాము ఢిల్లీ వెళ్లామని... తమ కారును బాలయ్యే స్వయంగా ఢిల్లీ వరకు డ్రైవ్ చేశారని తెలిపారు.

కార్ డ్రైవింగ్ ను ఆయన చాలా ఎంజాయ్ చేస్తారని... ఆయన ఓ పర్ఫెక్ట్ డ్రైవర్ అని అన్నారు. తన డ్రైవింగ్ ఎలా ఉందని తనను ఓ సారి బాలయ్య అడిగారని... 'మీరు పర్ఫెక్ట్ డ్రైవర్ సార్' అని తాను చెప్పానని... దీనికి కూడా ఆయన తనపై సెటైర్ వేశారని... 'డ్రైవింగ్ బాగుందనాలి కాని... పర్ఫెక్ట్ డ్రైవర్ అంటే... నేనేమైనా డ్రైవర్ నా?' అంటూ చమత్కరించారని చెప్పారు.

ఢిల్లీలో వారి సోదరి పురందేశ్వరి నివాసానికి వెళ్లామని చెప్పారు. తాము అక్కడకు వెళ్లక ముందే మెనూ ఏంటో ఫోన్ లో బాలయ్య చెప్పారని... తాను వెజిటేరియన్ మాత్రమే తింటానంటూ తన గురించి ఫోన్లో చెప్పారని గుర్తు చేసుకున్నారు. బాలయ్యతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.
Go Back to Shorts
thotapalli madhu
Balakrishna

More Telugu News