'బీ రెడీ'... అమెరికా, జపాన్ లకు ఉత్తరకొరియా హెచ్చరికలు!
- ఉగ్రవాద దేశాల జాబితాలో తమను చేర్చడంపై గుర్రుగా ఉన్న ఉత్తరకొరియా
- అమెరికా వాదనకు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వంతపాడుతున్నాయి
- భవిష్యత్ పరిణామాలకు అమెరికా, జపాన్ సిద్ధంగా ఉండాలి
- గువామ్ ద్వీపంపై అణ్వాయుధ దాడి జరిగితీరుతుంది
అమెరికాకు దక్షిణకొరియా, జపాన్ దేశాలు వంతపాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా గతంలో తాము ప్రకటించిన విధంగా అమెరికాకు చెందిన గువామ్ ద్వీపంపై న్యూక్లియర్ మిసైల్ దాడి జరుపుతామని స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలకు అమెరికా, జపాన్ దేశాలు సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ, ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.