charan: చరణ్ తో బోయపాటి సినిమా మొదలు .. కథానాయికగా మళ్లీ రకుల్?

షార్ట్స్‌లో చూడండి
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' సినిమా చూసిన తరువాత, ఆయన దర్శకత్వంలో చేయడానికి చిరంజీవి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. అయితే అనుకోకుండా బోయపాటి దర్శకత్వంలో ఆయనకంటే ముందుగా చరణ్ చేసేస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమా ఈ రోజున హైదరాబాదులోని ప్రొడక్షన్ ఆఫీస్ లో ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. రకుల్ ని తీసుకోవడం జరిగితే .. చరణ్ తోను .. బోయపాటితోను ఆమెకి ఇది మూడవ సినిమా అవుతుంది. 
Go Back to Shorts
charan
rakul

More Telugu News