ఆ సీన్ చేసిన తరువాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన నాకు సారీ చెప్పారు!: గౌతమి
Add ap7am to your home Screen

ఆ సీన్ చేసిన తరువాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన నాకు సారీ చెప్పారు!: గౌతమి

  • 'ద్రోహి' సినిమాలో ఆ సీన్ ను మర్చిపోలేం 
  • ఆ క్రెడిట్ శుభలేఖ సుధాకర్ కి వెళుతుంది
  • డైరెక్టర్ కట్ చెప్పాక .. ఆయన చాలా బాధపడ్డారు
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా గౌతమి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెకి మంచి పేరు తెచ్చిన సినిమాల్లో, పీసీ శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన 'ద్రోహి' ఒకటి. ఆ సినిమాలో శుభలేఖ సుధాకర్ కాంబినేషన్లో ఆమె చేసిన ఒక సీన్ గురించిన ప్రస్తావన తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో వచ్చింది. ఆ సినిమాలో ఓ అమ్మాయిపై శుభలేఖ సుధాకర్ అఘాయిత్యం చేయబోగా అడ్డుకుని .. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని హత్య చేసేస్తుంది.

ఆ సీన్ గురించి గౌతమి మాట్లాడుతూ .." ఆ సీన్లో ఇద్దరిలో ఏ ఒక్కరో బాగా చేస్తే అది పండదు .. ఇద్దరం సమానంగా చేయడం వల్లనే ఆ సీన్ ఎక్కడికో వెళ్లింది. శుభలేఖ సుధాకర్ వలన నేను బాగా చేయగలిగాను .. నా రియాక్షన్ వలన ఆయన అద్భుతంగా చేశారు. నిజం చెప్పాలంటే ఈ సీన్ కి సంబంధించిన క్రెడిట్ ఆయనకే వెళుతుంది. ఆ పాత్రలో ఆయన కళ్లలో ఈవెల్ నెస్ ..  వెర్రితనం చూసి షాక్ అయ్యాను. డైరెక్టర్ కట్ చెప్పగానే "ఐయామ్ సో సారీ అమ్మా .. ఐయామ్ సో సారీ అమ్మా .." అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఫరవాలేదండీ అని నేను చెబుతున్నా ఆయన వినిపించుకోలేదు" అంటూ ఆనాటి సంఘటనను వివరించారు.      
gauthami
subhalekha sudhakar

More Telugu News