గీతా ఆర్ట్స్ లో శ్రీకాంత్ అడ్డాల!
- 'బ్రహ్మోత్సవం'తో ప్లాప్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల
- కొంతకాలంగా మరో కథపై కసరత్తు
- నూతన నటీనటులతో కొత్త ప్రాజెక్టు
- నిర్మాతగా అల్లు అరవింద్
ఆ తరువాత ఆయన మరో కథపై కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ కథ పూర్తయిన తరువాత ఆయన అల్లు అరవింద్ ను కలవగా, గీతా ఆర్ట్స్ పై తెరకెక్కించడానికి అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ కొత్తగా .. కథనం ఆసక్తికరంగా ఉండటం వల్లనే అల్లు అరవింద్ ఓకే చెప్పారని అంటున్నారు. ఈ సినిమా నూతన నటీనటులతో తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి .. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.