వెయ్యి మంది విద్యార్థులకు సంవత్సరం పాటు ఉచిత భోజనం... దాతృత్వం చూపించిన ఐశ్వర్యరాయ్
- 44వ పుట్టినరోజు సందర్భంగా ఐష్ సంఘసేవ
- ఇస్కాన్ వారి అన్నామృత ఫౌండేషన్ ద్వారా అమలు
- 2004 నుంచి ఈ పథకాన్ని నడుపుతున్న ఇస్కాన్
ఈ పథకం ద్వారా ముంబైలోని 500 మున్సిపల్ పాఠశాలల్లో, మహారాష్ట్రలోని 2000కి పైగా పాఠశాలల్లో ఇస్కాన్ వారు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా మంచి పోషకాహారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి రాధానాథ్ స్వామి మహరాజ్ తెలిపారు. 900 మంది విద్యార్థులకు భోజన అవసరాలు తీర్చడానికి 2004లో చిన్న గదిలో ప్రారంభమైన ఈ పథకం, ఇవాళ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో దాదాపు 12 లక్షల మంది విద్యార్థుల ఆకలిని తీరుస్తోందని ఆయన పేర్కొన్నారు.