ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ?
Add ap7am to your home Screen

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ?

  • 'జై సింహా' షూటింగులో బాలకృష్ణ 
  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • ఈలోగా మరో మూవీ చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ
ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు వెంకటేశ్ తో దర్శకుడు తేజ ఒక సినిమా చేయనున్నాడు. వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లే బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ మొదలయ్యే వరకూ ఖాళీగా ఉండటం లేదనీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే వార్త ఒకటి షికారు చేస్తోంది.

బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి కథలు వినిపించిన దర్శకుల జాబితాలో ఎస్వీ కృష్ణారెడ్డి వున్నారనే టాక్ వినిపించింది. ఆయనతోనే సినిమా వుండనున్నట్టు కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది కూడా. అప్పుడు ఆయన వినిపించిన కథ బాలకృష్ణకి నచ్చిందట .. ఇప్పుడు ఆ సినిమాను మొదలు పెట్టడానికి బాలకృష్ణ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. 'జై సింహా' షూటింగ్ పూర్తికాగానే, ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    
balakrishna

More Telugu News