ఇందిరాగాంధీతో ప్రియాంక కుటుంబం... పాత ఫొటో ఒకటి షేర్ చేసిన ప్రియాంక‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇందిరాగాంధీతో ప్రియాంక కుటుంబం... పాత ఫొటో ఒకటి షేర్ చేసిన ప్రియాంక‌!

  • స‌హ‌నం కోల్పోయిన నెటిజ‌న్లు
  • గాంధీ కుటుంబాన్ని విమ‌ర్శిస్తూ కామెంట్లు
  • హత్యాకాండ జ‌రిపిన కుటుంబానికి మ‌ద్ద‌తివ్వ‌డం త‌గదంటూ వ్యాఖ్య‌లు
ప్రియాంక చోప్రా... గ్లోబ‌ల్ స్టార్‌గా ప్ర‌పంచ‌మంతా పాప్యులారిటీ సంపాదించిన భార‌తీయ న‌టి. ఇన్‌స్టాగ్రాం, ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌తి ఒక్క విషయాన్ని అభిమానుల‌తో పంచుకోవ‌డానికి ఎప్పుడూ ముందుండే న‌టి. ఈ నేప‌థ్యంలోనే అక్టోబ‌ర్ 31న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రాంలో ఓ పాత ఫొటోనే షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇందిరాగాంధీతో పాటు ప్రియాంక త‌ల్లి, పిన్ని, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఉన్నారు.

ఈ ఫొటో షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే చాలా లైకులు, కామెంట్లు చాలా వ‌చ్చాయి. ఈ కామెంట్లలో నెటిజ‌న్లు త‌మ స‌హ‌నం కోల్పోయి ప్ర‌వ‌ర్తించారు. ఒక వర్గంపై జరిగిన సామూహిక హత్యాకాండకు బాధ్యురాలిగా పరిగణించబడే ఇందిరా గాంధీతో ఫొటో దిగ‌డానికి ప్రియాంక‌ కుటుంబానికి సిగ్గు లేదా? అని, ఆ ఫొటో షేర్ చేయ‌డానికి ప్రియాంక‌కు మ‌న‌సెలా వ‌చ్చింద‌ని కామెంట్లు చేశారు. కొంత‌మంది నెటిజ‌న్లు అస‌భ్య ప‌ద‌జాలాన్ని కూడా ఉప‌యోగించారు. అయితే మ‌రికొంత మంది అభిమానులు మాత్రం ఫొటో బాగుంద‌ని, ఇంకా ఏమైనా పాత ఫొటోలు షేర్ చేయాల‌ని ప్రియాంక‌ను కోరారు.
indira gandhi
priyanka chopra
old photo
instagram
slammed

More Telugu News