భూటాన్ బుల్లి రాజు గ్యాల్సీతో భారత విదేశాంగ మంత్రి సుష్మా ముచ్చట్లు
- కుటుంబసమేతంగా ఢిల్లీ విచ్చేసిన భూటాన్ రాజు
- స్వాగతం పలికిన కేంద్ర విదేశాంగ మంత్రి
- యువరాజు గ్యాల్సీతో ముచ్చటించిన సుష్మా
అక్కడ మీడియా దృష్టనంతా బుల్లి యువరాజు గ్యాల్సీ ఆకర్షించాడు. భూటాన్ సంప్రదాయ దుస్తులు ధరించిన వాంగ్‌చుక్ కుటుంబం, సుష్మా స్వరాజ్‌తో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా గ్యాల్సీతో సుష్మా కాసేపు ముచ్చటించారు. తన పర్యటనలో భాగంగా వాంగ్‌చుక్ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై వారు చర్చించనున్నారు.