అమెరికా అధ్యక్ష భవనంలో ఘనంగా హాలోవీన్ వేడుకలు.. ఫొటోలు చూడండి!
- చిన్నపిల్లలతో నిండిపోయిన వైట్‌హౌస్ ప్రాంగణం
- వివిధ వేషధారణల్లో హాజరైన పిల్లలు
- సాదరంగా ఆహ్వానించిన ట్రంప్ దంపతులు
వర్జీనియా, మేరీల్యాండ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా రాష్ట్రాల్లోని 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రకరకాల వేషధారణల్లో పిల్లలందరినీ డొనాల్డ్ ట్రంప్, మెలానియాలు సాదరంగా ఆహ్వానించారు. హాలోవీన్ పండగకు అనుగుణంగా రకరకాల బొమ్మలు, గుమ్మడికాయలతో ప్రాంగణాన్ని అలకరించారు. పిల్లలందరికీ బహుమతులను పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.


