Mamata Banerjee: 'అన్నింటికీ ఆధార్ కార్డు అనుసంధానం'పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మ‌మ‌తా బెన‌ర్జీ

షార్ట్స్‌లో చూడండి
అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతోన్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. త‌న మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయ‌బోన‌ని, ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని ఇటీవ‌లే తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. ఆధార్ కార్డును అన్నింటికీ లింక్ చేయాల‌ని సూచిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వంపై ఆమె మండిప‌డుతున్నారు. ఇదే విష‌యంపై ఆమె ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అన్నింటికీ ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేయ‌డం ప‌ట్ల అభ్యంత‌రాలు తెలుపుతూ పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై న్యాయ‌స్థానం ఈ నెల 30న విచార‌ణ జ‌ర‌ప‌నుంది.  
Go Back to Shorts
Mamata Banerjee
supreme

More Telugu News