ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్: రెండో రౌండ్‌లోకి చేరుకున్న సింధు, శ్రీకాంత్
- మొదటి రౌండ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన భారత షట్లర్లు
- జర్మనీ క్రీడాకారుడు ఫాబియన్ రోత్‌తో తలపడిన కిడాంబి శ్రీకాంత్
- స్పెయిన్ క్రీడాకారిణి బిట్రీజ్ కొర్రాలెస్‌ను ఓడించిన పీవీ సింధు
స్పెయిన్ క్రీడాకారిణి బిట్రీజ్ కొర్రాలెస్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించి పీవీ సింధు రెండో రౌండ్‌కి చేరింది. రెండో రౌండ్‌లో జపాన్‌కి చెందిన సయాక టకహషితో సింధు తలపడనుంది. ఇక పురుషుల డబుల్స్‌లోనూ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల జోడీ కూడా రెండో రౌండ్‌కి చేరుకుంది. వీరి జోడి, ఫ్రెంచి జోడి బాస్టియన్ కుర్సాది, జూలియన్ మయోని 21-12, 21-14 తేడాతో ఓడించింది. రెండో రౌండ్‌లో డెన్మార్క్ జోడి మాడ్స్ కొన్రాడ్ పీటర్సన్, మాడ్స్ పీలర్ కోల్డింగ్‌లతో తలపడనుంది.