సినిమాలు వదిలేశాను.. నేను కొత్త జీవితం మొదలు పెట్టాను!: రిచా గంగోపాధ్యాయ
- 2013లోనే సినిమాలను వదిలేశాను
- ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టాను
- ఈ జీవితంలో నటన అనే అంశమే లేదు
దీంతో తనను కొత్త సినిమా గురించి అడిగిన వారందరికీ రిచా ఒక స్పష్టమైన సమాధానం చెప్పింది. తాను సినిమాలను ఐదేళ్ల క్రితం అంటే 2013లో వదిలేశానని తెలిపింది. ఇప్పుడు తాను కొత్త జీవితంలో అడుగుపెట్టానని తెలిపింది. అందులో నటన అనే అంశమేలేదని స్పష్టం చేసింది. దీంతో ఇకపై సినిమాల్లో కనిపించనని స్పష్టంగా అభిమానులకు చెప్పింది. కాగా, రిచా వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.