ఒక రోజు ముందుగానే విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'!
Add ap7am to your home Screen

ఒక రోజు ముందుగానే విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'!

  • పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి'
  • త్వరలో యూరప్ షెడ్యూల్ మొదలు
  • ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి 
  • సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు  
పవన్ .. త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా ఓ మినీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలో చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఈ సినిమా టీమ్ యూరప్ వెళ్లనుంది. ప్రధాన పాత్రధారులు పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను 15 రోజుల పాటు అక్కడ చిత్రీకరించనున్నారు.

 షూటింగ్ తో సమానంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. డిసెంబర్ 2వ వారం నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారట. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒక రోజు ముందుగానే ఈ సినిమాను థియేటర్స్ కు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ మధ్య మిడ్ నైట్ షోలకి .. ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు లభించడం కష్టమవుతోన్న నేపథ్యంలో, ఈ సినిమాను జనవరి 9వ తేదీన సెకండ్ షోతో విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.            
pavan
keerthi suresh

More Telugu News