కేసీఆర్ బయోపిక్ హీరో ఫిక్సయ్యాడు!

  • ఇప్పటికే కథను సిద్ధం చేసిన 'మధుర' శ్రీధర్
  • హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ
  • చర్చలు జరిపిన శ్రీధర్
  • త్వరలోనే పట్టాలెక్కే అవకాశం
ఉద్యమం, రాజకీయాలు, ఉపవాస దీక్షలు, ప్రజాభిమానం, రాజకీయంగా ఎత్తుపల్లాలు, అనుకున్నది సాధించిన ధీరత్వం... ఇది క్లుప్తంగా కేసీఆర్ జీవితంలోని కొన్ని ఘట్టాలు. ఓ సినిమా కథకు కావాల్సిన హంగులన్నీ ఆయన జీవితంలో ఉన్నాయనడంలో సందేహం లేదు. అందుకే ఎంతో మంది దర్శకులు కేసీఆర్ బయోపిక్ ను తీయాలని ముందుకు వచ్చారు. వారిలో ముందు నిలిచిన దర్శక - నిర్మాత 'మధుర' శ్రీధర్ రెడ్డి, కథను సిద్ధం చేసుకోవడంతో పాటు హీరోను కూడా సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ పాత్రకు హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అయితే నప్పుతాడని భావించిన శ్రీధర్, ఆయన్ను కలిసి చర్చించినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీధర్ తో పాటు దర్శకుడు లక్ష్మణ్ (బందూక్ ఫేమ్) కూడా కేసీఆర్ పై ఓ సినిమాకు రూపకల్పన చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కేసీఆర్ బయోపిక్ తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
kcr
bio pic
nawazuddeen sidhiqui

More Telugu News