హైదరాబాద్ హెరిటేజ్ సూపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం

  • షార్ట్ సర్క్యూట్ తో మంటలు
  • భారీగా ఆస్తి నష్టం
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ ఇంజన్లు
హైదరాబాద్, శ్రీనగర్‌ కాలనీలోని హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌ లో ఆదివారం తెల్లవారుఝామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడం, లోపల మంటలు కనిపిస్తుండటంతో, దాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను కంట్రోల్ లోకి తెచ్చారు. మొత్తం మూడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పాయి.

 కాగా, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. హెరిటేజ్ మార్కెట్లో ఉన్న ఆహార, నిత్యావసర ప్రొడక్టులన్నీ తగులబడి పోయినట్టు తెలుస్తోంది. స్టోర్ ఉన్నతోద్యోగులు వచ్చిన తరువాతనే ఎంత నష్టం సంభవించిందన్న విషయం తెలుస్తుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
heritage
fire accident
hyderabad

More Telugu News