venkatesh: వెంకటేశ్ తో ఎలాంటి విభేదాలు లేవు .. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తా : కిషోర్ తిరుమల

షార్ట్స్‌లో చూడండి
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'ఉన్నది ఒకటే జిందగీ' .. ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కిషోర్ తిరుమల మాట్లాడుతూ వుండగా, 'ఆడాళ్లూ మీకు జోహార్లు' ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాను ఆయన కొంతకాలం క్రితమే వెంకటేశ్ తో చేయవలసి వుంది. ఆ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

 అందుకు కిషోర్ తిరుమల స్పందిస్తూ .. ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని చెప్పారు. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, ఇతర ప్రాజెక్టులతో అటు వెంకీ .. ఇటు తాను బిజీగా ఉండటం వలన ఆలస్యమైందని అన్నారు. వెంకటేశ్ తో తనకి విభేదాలు వచ్చాయనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనీ, ఆయనతో తప్పకుండా ఆ సినిమా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక నానితోను .. నితిన్ తోను తన తదుపరి సినిమాలు వుంటాయని చెప్పారు.    
Go Back to Shorts
venkatesh

More Telugu News