రాజశేఖర్ పై ప్రశంసలు కురిపించిన బాలకృష్ణ

  • రాజశేఖర్ విలక్షణ నటుడు
  • ఆయన వెనకున్న అదృశ్య శక్తి జీవిత
  • 'గరుడ వేగ' థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించిన బాలయ్య
హీరో రాజశేఖర్ పై నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రశంసల జల్లు కురిపించారు. తన సోదరుడు రాజశేఖర్ విలక్షణ నటుడంటూ కితాబిచ్చారు. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో తనదైన శైలిలో నటించి, ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు రాజశేఖర్ అని అన్నారు. మన దేశంలో మరెక్కడా లేనటువంటి అభిరుచి తెలుగు ప్రేక్షకులకు ఉందని... తాను కానీ, రాజశేఖర్ కానీ ఎలాంటి కొత్తదనాన్ని అందిస్తున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారని చెప్పారు. రాజశేఖర్ నటిస్తున్న 'గరుడ వేగ' సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ ను బాలయ్య ఆవిష్కరించారు.

రాజశేఖర్ వెనకున్న అదృశ్య శక్తి జీవిత అని బాలయ్య కొనియాడారు. వీళ్ల పిల్లలు కూడా నిర్మాతలుగా సినీ రంగంలోకి రానుండటం ఆనందదాయకమని చెప్పారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తే, తాను సైడ్ కేరక్టర్ చేస్తానని... విలన్ గా నటించేందుకు కూడా సిద్ధమేనని ఈ సందర్భంగా రాజశేఖర్ తెలిపారు. 
Go Back to Shorts
balakrishna
actor raja sekhar
garud vega
tollywood

More Telugu News