ముఖ్యమంత్రి చాంబర్ సెట్లో మహేశ్ బాబు!
Add ap7am to your home Screen

ముఖ్యమంత్రి చాంబర్ సెట్లో మహేశ్ బాబు!

  • తాజా షెడ్యూల్ షూటింగులో కొరటాల 
  • ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ప్రత్యేక పాత్రలో ప్రకాశ్ రాజ్      
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను ఆల్రెడీ షూట్ చేశారు. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన ముఖ్యమంత్రి చాంబర్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. మహేశ్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. కైరా అద్వాని తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

 నవంబర్ 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా కొనసాగనుంది. తెలుగులో తొలి సినిమాతోనే మహేశ్ జోడీగా అవకాశం రావడం పట్ల కైరా అద్వాని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కొంతమంది కథానాయికల విషయంలోనే ఇలా జరుగుతూ ఉంటుందని అంటోంది. హిందీలో 'ఎమ్మెస్ ధోని' .. ది అన్ టోల్డ్ స్టోరీ మాదిరిగానే, తెలుగులో ఈ సినిమా తనకి మంచి గుర్తింపును తీసుకువస్తుందని భావిస్తోంది.      
mahesh babu
kiara advani

More Telugu News