gunasekhar: గుణశేఖర్ 'హిరణ్యకశిప' లైన్లోనే వుంది .. టైటిల్ రోల్ లో రానా

షార్ట్స్‌లో చూడండి
'ఒక్కడు' .. 'చూడాలని వుంది' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించిన గుణశేఖర్, 'బాలల రామాయణం'తో పౌరాణికాలను .. 'రుద్రమదేవి'తో చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలనని నిరూపించాడు. త్వరలో ఆయన 'హిరణ్య కశిప' అనే మరో పౌరాణికానికి శ్రీకారం చుట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. 'హిరణ్యకశిప' పాత్ర కోసం ఆయన రానాను ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది.

 అయితే అసలు ఈ పాత్రను చేయాలని రానానే ఉత్సాహం చూపుతున్నాడేది తాజా సమాచారం. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటోన్న రానా, 'హిరణ్య కశిప' పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడట. దాంతో తమ బ్యానర్లో ఆ సినిమాను తెరకెక్కించాలని సురేశ్ బాబు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సురేశ్ బాబు ఇప్పటికే నాలుగైదు సార్లు గుణశేఖర్ తో చర్చలు జరిపాడని అంటున్నారు. త్వరలోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.      
Go Back to Shorts
gunasekhar

More Telugu News