నిర్మాత హార్వీ వేధింపుల బారిన పడకుండా ఐశ్వర్య రాయ్ ను కాపాడిన మాజీ మేనేజర్
- హాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌లో వెల్లడించిన సిమోనె షెఫీల్డ్
- ఐశ్వర్యను ఒంటరిగా కలవడానిక హార్వీ చాలా ప్రయత్నించేవాడట
- హార్వీ నీడను తన క్లెయింట్ల మీద పడనీయలేదన్న సిమోనె
`గతంలో భారతీయ నటి ఐశ్వర్యరాయ్ విషయాలు నేను చూసుకునేదాన్ని. ఆ సమయంలో ఐశ్వర్యను ఒంటరిగా కలవడానికి హార్వీ తీవ్రంగా ప్రయత్నించేవాడు. మేం ముగ్గురం మాట్లాడుతున్నపుడు నన్ను అక్కడి నుంచి వెళ్లిపోమనేవాడు. ఒకరోజు ఎలాగైనా ఐష్‌తో ఒంటరిగా సమావేశం ఏర్పాటు చేయమని, అందుకు తానేం చేయాలో చెప్పమని నన్ను వేడుకున్నాడు. దానికి నేను చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాను.
తర్వాత నేను వాడికి కోక్‌తో నింపిన పంది బొమ్మను బహుమతిగా పంపించా. అందుకు నన్ను చాలా సార్లు బెదిరించాడు. అయినప్పటికీ నా క్లెయింట్ల మీద వాడి నీడ పడనీయలేదు` అని సిమోనె షెఫీల్డ్ వెల్లడించింది. హార్వీకి వ్యతిరేకంగా ఒక్కో హీరోయిన్ తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడాన్ని సిమోనె మెచ్చుకుంది. `కలిసి పోరాడితే విజయం దొరుకుతుందంటారు. అలా పోరాడాలంటే ఒక్కరు గొంతు విప్పాలి. అలా విప్పిన వారికి అండగా మిగతా వారు ఉంటారు. నిజాన్ని దాచకండి. సోషల్ మీడియా మాధ్యమంగా మీ గొంతు కలపండి` అని ఆమె పేర్కొంది.