ween steen: హాలీవుడ్ ప్రొడ్యూసర్ గుట్టు రట్టు చేసిన హీరోయిన్లు ఏంజెలీనా జోలీ, గైనెత్

షార్ట్స్‌లో చూడండి
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ, సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టీన్ కు ఇప్పుడు ఇంకో షాక్ తగిలింది. ఆయన చేతిలో తాము కూడా లైంగికంగా వేధించబడ్డామని చెబుతూ, ప్రముఖ హీరోయిన్లు ఏంజెలీనా జోలీ, గైనెత్ ఫాల్ట్రోలు 'న్యూయార్క్ టైమ్స్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

"నేను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 'ఎమ్మా' చిత్రంలో అవకాశం లభించింది. దానికి వీన్ స్టీన్ నిర్మాత. బెవెర్లీ హిల్స్ లోని ఓ హోటల్ గదికి సమావేశం కోసం పిలుపు వచ్చింది. అక్కడికి వెళితే వీవ్ నాపై చేతులు వేశాడు. బాడీ మసాజ్ కోసం బెడ్ రూములోకి వెళ్లామన్నారు. నేను కుదరదని చెప్పి తిరస్కరించాను. ఈ విషయాన్ని నా బాయ్ ఫ్రెండ్ బ్రాడ్ పిట్ కు కూడా చెప్పాను" అని గైనెత్ పాల్ట్రో పేర్కొంది.

ఇక 1990 ప్రాంతంలో వీన్ స్టీన్ తో తనకు చెడు అనుభవం ఎదురైందని ఏంజెలినా వెల్లడించింది. ఆపై మరెప్పుడూ అతనితో కలసి పని చేయలేదని చెప్పింది. ఇక స్టీన్ మూడు దశాబ్దాల నాటి వైఖరిపై ప్రముఖ హీరోయిన్లు నోరు విప్పగానే, ఆయనతో వేధింపులకు గురైన ఇతర నటీమణులు ముందుకు వచ్చి తమకూ ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. ఇక తాజా పరిణామాలతో విసిగిపోయిన స్టీన్ భార్య జార్జినా చాప్ మన్, అతనికి దూరమవుతున్నట్టు ప్రకటించారు.
Go Back to Shorts
ween steen
anjalina jolie
gaineth

More Telugu News