vh: కుంభకోణాలన్నింట్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంది: వీహెచ్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన కుంభకోణాలన్నింట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. హైదరాబాదులోని గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, గ్యాంగ్‌ స్టర్‌ నయీమ్‌ ఎన్‌ కౌంటర్‌ తరువాత దొరికిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ కేసుపై తాను గతంలోనే సిట్ అధికారులకు, రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. ఈ కేసుపై ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టలేదని, ఉద్దేశపూర్వకంగా ఈ కేసును నీరుగార్చుతున్నారని ఆయన మండిపడ్డారు. 
Go Back to Shorts
vh
kcr
naeem
comments

More Telugu News