balakrishna: బౌన్సర్లను నియమించుకునే ఆలోచనలో బాలకృష్ణ!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో బాలకృష్ణ తన అభిమానులపై వరుసగా చేయి చేసుకుంటూ వస్తోన్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అభిమానంతో దగ్గరికి వచ్చినవారి పట్ల ఆయన అలా ప్రవర్తించి ఉండకూడదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక తాను ఎవరిపై చేయిచేసుకోవద్దనే నిర్ణయానికి బాలకృష్ణ వచ్చాడని అంటున్నారు.

తాను అభిమానులకి దగ్గరగా ఉండాలనీ .. వాళ్లతో కలిసిపోవాలని అనుకున్నానని సన్నిహితులతో చెప్పారట. ఈ కారణంగానే తాను బౌన్సర్లను దూరం పెట్టాననీ, అయితే కొంతమంది అభిమానులు తనపైకి దూసుకొస్తూ అసహనానికి గురిచేస్తున్నా రంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లు తొక్కుతూ .. నెట్టేస్తూ కోపాన్ని తెప్పిస్తున్నారనీ, ఆ సమయంలో ఒక దెబ్బ కొట్టడం వలన గోరంతలు కొండంతలు అవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇక తాను బౌన్సర్లను నియమించుకోవాలని నిర్ణయించుకున్నానని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.    
Go Back to Shorts
balakrishna

More Telugu News