లాస్ వెగాస్ నరహంతకుడు స్టీఫెన్ పెడ్డాక్ ప్రియురాలిని అమెరికాకు రప్పించి, విచారిస్తున్న ఎఫ్బీఐ
- పెడ్డాక్ ప్రియురాలు మరిలౌ డాన్లీని అమెరికా రప్పించిన ఎఫ్బీఐ అధికారులు
- మాండలే హోటల్ లో రూం తీసుకునేందుకు ఆమె పత్రాలనే వాడిన పెడ్డాక్
- హత్యాకాండకు రెండు వారాల ముందే ఫిలిప్పీన్స్ వెళ్లిన డాన్లీ
అంతే కాకుండా ఫిలిప్పీన్స్ లోని ఆమె అకౌంట్ కు 65 లక్షల రూపాయలు పంపినట్టు ఎఫ్బీఐ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఎందుకు పంపాడు? అన్న విషయాలు కూడా ఆరాతీయనున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఆమెను పెడ్డాక్ ఫిలిప్పీన్స్ పంపాడా? అన్న వివరాలు తెలుసుకోనున్నారు. ఫిలిప్పీన్స్ లో పుట్టిన డాన్లీకి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉండగా, లాస్ వెగాస్ నరమేధానికి రెండు వారాల ముందు ఆమె ఫిలిప్పీన్స్ కి, అక్కడి నుంచి ఒకసారి హాంగ్ కాంగ్ కు వెళ్లి వచ్చారు. వీటన్నింటిపైనా ఎఫ్బీఐ అధికారులు కూపీ లాగనున్నారు.