వాకిలి ఇలా కూడా శుభ్రం చేయొచ్చా?... వైరల్‌గా మారుతున్న పాకిస్థానీ మహిళ వీడియో
- హోవర్ బోర్డ్ సాయంతో వాకిలి శుభ్రం
- సాంకేతికతకు కొత్త అర్థం చెబుతోందంటూ ప్రశంస
- పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
హోవర్ బోర్డ్ మీద కూర్చుని వాకిలి మొత్తం శుభ్రం చేసింది. ఆమె అలా శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదండోయ్... ఈ వీడియో చూసినవారంతా ఆ మహిళ సాంకేతికతకు కొత్త అర్థం చెప్పిందంటూ ప్రశంసిస్తున్నారు. `ఆమె 3017 సంవత్సరానికి చెందిన మహిళ` అని, `హోవర్ బోర్డ్‌ను 100 శాతం వాడుతోంది` అని ఇలా రకరకాల నవ్వు పుట్టించే కామెంట్లు చేస్తున్నారు.