mahesh babu: నైజామ్ లో 'స్పైడర్' తొలి నాలుగు రోజుల వసూళ్లు!

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా క్రితం నెల 27వ తేదీన భారీస్థాయిలో 'స్పైడర్' తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే, నైజామ్ లోను మహేశ్ బాబు మూవీస్ మంచి వసూళ్లను సాధిస్తూ ఉంటాయి. అందువలన ఈ సినిమా కూడా ఇక్కడ రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తుందని అంతా భావించారు.

 తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇక్కడ 7.8 కోట్ల షేర్ ను రాబట్టింది. కథా కథనాలతో పాటు, దర్శకుడిగా మురుగదాస్ కి గల ఇమేజ్ .. మహేశ్ క్రేజ్ .. రకుల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని భావించారు. కానీ అన్ని ఏరియాల్లోను ఈ సినిమా వసూళ్లు తగ్గుతూ వస్తుండటం యూనిట్ ను కలవరపెడుతోంది. ఇక తమిళంలో ఈ సినిమా వసూళ్ల జోరు ఏ స్థాయిలో వుందన్నది తెలియాల్సి వుంది.    
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News