మ‌హీరా ఖాన్ సిగరెట్ తాగుతున్న ఫొటోను ప్రచారానికి వాడుకున్న పాకిస్థానీ కేఫ్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌హీరా ఖాన్ సిగరెట్ తాగుతున్న ఫొటోను ప్రచారానికి వాడుకున్న పాకిస్థానీ కేఫ్‌!

  • కేఫ్ లిక్విటేరియా వినూత్న ప్ర‌చారం
  • రణ్ బీర్ ఫోటోను తొలగించిన వైనం  
  • దిగ‌జారిన మార్కెటింగ్ అని విమ‌ర్శించిన నెటిజ‌న్లు
ఇటీవ‌ల ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో క‌లిసి పాకిస్థానీ న‌టి మ‌హీరా ఖాన్ సిగ‌రెట్ తాగుతున్న ఫొటో ఒక‌టి నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫొటో మీద చాలా మంది వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కూడా చేశారు. మ‌హీరా అలా కుర‌చ దుస్తులు ధ‌రించి, సిగ‌రెట్ తాగుతూ త‌న ప‌రువు పోగొట్టుకుందని, ర‌ణ్‌బీర్‌, మ‌హీరాల మ‌ధ్య ఏదో సంబంధం కొనసాగుతోంద‌ని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.

 మ‌రో ప‌క్క పాకిస్థాన్‌కి చెందిన కేఫ్ లిక్విటేరియా మాత్రం ఆ వివాదాస్ప‌ద ఫొటోను ఇంకో విధంగా వాడుకుంది. త‌మ పానీయాల ప్రచారం కోసం ఆ ఫొటోలో నుంచి ర‌ణ్‌బీర్‌ను తొల‌గించి మ‌హీరా ఖాన్‌ను మాత్రం వారు ఉప‌యోగించుకున్నారు. మ‌హీరా తాగుతున్న సిగ‌రెట్‌ను కొద్దిగా పొడ‌వు పెంచి స్ట్రా లాగ క‌నిపించేలా చేశారు. ఆ స్ట్రాతో ఆమె త‌మ స్పెష‌ల్ కాఫీని తాగుతున్న‌ట్లుగా చూపించారు.

 ఆ ఫొటోను త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు త‌మ స్పంద‌న‌లు తెలియ‌జేశారు. కొంత మంది ఈ ఐడియాను పొగ‌డ్త‌ల‌తో ముంచేయ‌గా, మ‌రి కొంతమంది మాత్రం `దిగ‌జారిన మార్కెటింగ్ టెక్నిక్‌` అంటూ విమ‌ర్శించారు. ఏదేమైనా ఈ ప్రచార ఫొటో ద్వారా స‌ద్దుమ‌ణిగిన విష‌యాన్ని ఆ కేఫ్ మ‌ళ్లీ తెర మీద‌కి తీసుకువ‌చ్చిన‌ట్లైంది.
mahira khan
cafe liquiteria
ranbir kapoor
viral photo
twitterati

More Telugu News