ఉద్యోగంలో తృప్తి లేదంటూ 23వ అంతస్తు నుంచి దూకేసిన ఐఐటీయన్
- రెండు టవర్లను కలిపే వాక్ వే పై నుంచి దూకిన అంకిత్
- మానసిక ఒత్తిడే కారణమన్న పోలీసులు
నిన్న డిన్నర్ చేసిన తరువాత తన రూములోకి వెళ్లిన అంకిత్ మృతదేహం నాలుగు గంటల తరువాత గ్రౌండ్ ఫ్లేర్ లో కనిపించింది. రెండు టవర్లనూ కలిపే వాక్ వే పై నుంచి అంకిత్ దూకినట్టుగా తెలుస్తోంది. మానసిక ఒత్తిడి కారణంగానే అంకిత్ ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడని, గత 16 నెలలుగా అతను ఒత్తిడిలో ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైందని పోలీసు అధికారి గౌరవ్ ఫోగత్ తెలిపారు. ఉన్నత విద్య చదివి మరింత ఎత్తునకు ఎదగాలన్నది అతని ఆశయమని, తన మీద ఉన్న బాధ్యతలు ఆశయానికి అడ్డుగా ఉన్నాయని భావించేవాడని తెలిపారు. కాగా, ఈ కేసును ఇతర కోణాల్లోనూ విచారిస్తున్నామని పేర్కొన్నారు.