అంజలి సోదరి సినీ రంగ ప్రవేశంపై వార్త పుకారేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంజలి సోదరి సినీ రంగ ప్రవేశంపై వార్త పుకారేనట!

  •  తమిళ సినిమాలతో బిజీగా వున్న అంజలి
  •  ఆమె సిస్టర్ ఆరాధ్య కూడా రంగంలోకి దిగినట్టుగా వార్తలు
  •  ఇదంతా పుకారు అంటూ తాజా వార్తలు 
  •  అంజలికి అక్క మాత్రమే వుంది   
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అంజలికి మంచి క్రేజ్ వుంది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకోవడం అంజలి ప్రత్యేకత. తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న అంజలి, తెలుగులోను స్పీడ్ పెంచడానికి నాజూకుగా తయారైంది. తెలుగు నుంచి ఛాన్సులు వెళుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

 ఈ నేపథ్యంలో అంజలి సిస్టర్ 'ఆరాధ్య' కూడా వెండితెరపైకి వచ్చేస్తుందనే వార్త ఒకటి కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అంజలి స్ఫూర్తితో తాను నటిగా కెరియర్ ను ఆరంభించాలని నిర్ణయించుకున్నట్టు .. సముద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని ఆరాధ్య చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అంజలికి ఒక అక్క వుందని, ఆమె వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయిందని తాజాగా వార్తలొస్తున్నాయి.    
anjali

More Telugu News