'స్పైడర్'లో ఒక్క నెగటివ్ పాయింట్ కూడా లేదు!: ఉమేర్ సంధు
Add ap7am to your home Screen

'స్పైడర్'లో ఒక్క నెగటివ్ పాయింట్ కూడా లేదు!: ఉమేర్ సంధు

  • విదేశాల్లో భారతీయ సినిమాలను సెన్సార్ చేసే ఉమేర్ సంధు
  • స్పైడర్ అదిరిపోయింది
  • ఈ సినిమాలో డల్ పాయింట్సే లేవు
  • సినిమా ఆద్యంతం రేసులా పరుగులు పెట్టింది
  • మహేష్ బాబు సూపర్
  • మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్
 'స్పైడర్' సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే సెన్సార్ బోర్డు సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను విదేశాల్లో సెన్సార్ కు పంపారు. భారత్ లోనే ఒక్క కట్ కూడా పొందకుండా యూ/ఏ సర్టిఫికేట్ సంపాదించుకున్న  'స్పైడర్' మహేష్ బాబు విదేశాల్లోని సెన్సార్ బోర్డు సభ్యులను కూడా ఫిదా చేసేశాడు. ఈ నేపథ్యంలో అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమేర్ సంధు  'స్పైడర్'పై తన రివ్యూను ఇచ్చేశాడు.

 సినిమా అద్భుతంగా ఉందని తెలిపాడు. సినిమాలో ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదని చెప్పాడు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు రేసుగుర్రంలా పరుగులు తీసిందని అన్నాడు. మహేష్ బాబు ఎప్పట్లాగే అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపాడు. మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఉమేర్ సంధు తెలిపాడు. అయితే ఈసినిమాకు రేటింగ్ మాత్రం ఇవ్వకపోవడం విశేషం. 
spaider
maheshbabu
murugadas
rakul preet singh
spaider movie
umair sandhu

More Telugu News