సాయిధరమ్ తేజ్, నిహారిక పెళ్లి వార్తలపై స్పందించిన నాగబాబు!
Add ap7am to your home Screen

సాయిధరమ్ తేజ్, నిహారిక పెళ్లి వార్తలపై స్పందించిన నాగబాబు!

  •  అదొక ఫూలిష్ న్యూస్
  •  ఏ దరిద్రుడో క్రియేట్ చేసి ఉంటాడు
  •  తేజు .. నిహారిక అన్నాచెల్లెళ్ల మాదిరిగా పెరిగారు
మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి విమర్శలు .. రూమర్లు వచ్చినా, వెంటనే నాగబాబు తనదైన శైలిలో వాటిని ఖండిస్తూ ఉంటారు. అసలు విషయాన్ని స్పష్టం చేయడానికి .. అవతలివారిపై మండిపడటానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. ముక్కుసూటిగా తాను చెప్పదలచుకున్నది చెప్పేస్తుంటారు.

 ఈ మధ్య సాయిధరమ్ తేజ్ .. నిహారిక కుటుంబాల మధ్య పెళ్లి మాటలు జరుగుతున్నాయనే ఒక వార్త షికారు చేసింది. ఆ విషయాన్ని గురించి తాజాగా నాగబాబు స్పందిస్తూ, అదొక ఫూలిష్ న్యూస్ అని అన్నారు. ఏ దరిద్రుడో ఆ వార్తను క్రియేట్ చేసి వుంటాడని చెప్పారు. నిహారికను తేజు ఎత్తుకుని తిరిగేవాడనీ .. వాళ్లిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెళ్ల మాదిరిగా పెరిగారని అన్నారు. పనీపాటా లేని వాళ్లు సృష్టించే పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.       
nagababu

More Telugu News