'స్పైడర్' సెన్సార్ టాక్... సినిమా సూపర్ హిట్టే!
- స్పైడర్ బాగుందన్న సెన్సార్ సభ్యులు
- మహేష్ బాబు ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డట్టే
- యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి
- విజయంపై ధీమాగా చిత్ర యూనిట్
సెన్సార్ సభ్యుల నుంచి ఈ మాటలు విన్న చిత్రయూనిట్ విజయంపై మరింత ధీమాగా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ బాబు అభిమానులు ఆనందంగా ఉన్నారు. 'స్పైడర్' సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించగా, మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో ప్రతి నాయకులుగా తమిళ నటులు ఎస్.జే. సూర్య, 'ప్రేమిస్తే' ఫేం భరత్ నటించడం విశేషం.