mahesh babu: సెన్సార్ పూర్తి చేసుకున్న 'స్పైడర్'

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తేదీ కోసం మహేశ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

 ఇప్పటికే ఈ సినిమా టీజర్లకు .. ట్రైలర్ కి .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తమిళ నటులు ఎస్.జె. సూర్య .. భరత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.  మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, తెలుగు .. తమిళ భాషలతో పాటు అరబిక్ భాషలోను విడుదలవుతుండటం విశేషం.      
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News