'జవాన్' రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

వరుస పరాజయాలతో డీలాపడిన సాయిధరమ్ తేజ్ .. 'జవాన్' సినిమాతో దసరాకి కాస్త అటు ఇటుగా ప్రేక్షకుల ముందుకు వద్దామని అనుకున్నాడు. అయితే ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న దిల్ రాజు, కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తే మరింత బాగా వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అంతే కాకుండా ఒక పాట షూటింగ్ కూడా పెండింగ్ లో వుంది.

దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి రాలేకపోతోంది. దిల్ రాజు సూచనల మేరకు మిగతా పనులను పూర్తిచేసి, నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైనట్టేనని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ చేసిన సంగతి తెలిసిందే. తాను చేసిన 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' .. 'జవాన్' వరుసగా విడుదల కానుండటంతో మెహ్రీన్ ఫుల్ ఖుషీ అవుతోందట.     
Go Back to Shorts
sai dharam tej
mehreen

More Telugu News